సి. కొత్తపల్లి గ్రామవాసులైన నా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ గ్రూపు నకు స్వాగతం సుస్వాగతం.
కొత్తపల్లి గ్రామానికి, మనకు గల అవినాభావ సంబంధం వెల కట్టలేనిది. కొత్తపల్లి లో పుట్టాం, పెరిగాం. పై చదువులకనో ఉద్యోగరిత్యా నో, బ్రతుకు తెరువు కోసమో, పెళ్ళి చేసుకోని అత్తగారిళ్ళలోనో ఎక్కడెక్కడో ఉంటున్నాం.
భగవంతుడు ఈ జన్మ లో ఇచ్చిన బంధాలను, స్నేహితులను, బంధుత్వాలను - ఇంకో జన్మలో కొనసాగిపడు - అసలు మళ్ళీ జన్మ అంటూ ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఈ జీవితం అశాశ్వితం - ఎప్పుడు ఎక్కడ గిట్టుతామో తెలియదు.
ఈ ఆధునిక యుగం లో బ్రతకాలి కాబట్టి ఉద్యోగం, పని, చదువు కై కొత్తపల్లిని విడిచి వుండక తప్పదు. కాబట్టి, ఈ జీవన్మరణ పోరాటంలో ఈ జన్మ కు ఆ భగవంతుడు ఇచ్చిన బంధాలను, స్నేహాన్ని, బంధుత్వాలనూ వదులుకోవాల్సిన పని లేదు, ఈ సోషియల్ మీడియా ద్వారా కొనసాగించుకుందాం.
ఈ సోషియల్ మీడియా మనకు ఒక వరం లాంటిది.
ఒకప్పుడు బంధువులు అంటే ఏ పెళ్ళికో, చావు కార్యాలకో కలుసుకునే వారు, కానీ ఇప్పుడు అలాంటి పని లేదు సోషియల్ మీడియా ద్వారా ఎప్పటికప్పు ఒకరికొకరు తమ తమ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ, కష్ట, సుఖాలను పంచుకుటున్నారు.
"బ్రతకడం అంటే ఉద్యోగం, పని చేసుకోవమే కాదు - కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో ప్రేమానురాగాలు పంచుకోవడం".
నేను, నా కుటుంబం, నా కష్టం, నా సుఖం అనటం లో ఆనందం ఉండదు - నీ ప్రపంచం అంటే పక్క రాష్ట్రమో, పక్క దేశమో కాదు. నీ ఊరు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులే నీ ప్రపంచం అని తెలుసుకో మిత్రమా !
ఈ గ్రూపు నందు ఎప్పటికప్పు మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తూనే, ఈ గ్రూపు నందు వున్న మన ఊరి వాళ్ళతో , మన బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటూ, మన ఐఖ్యత పది మందికి ఆదర్శం అయ్యేలా మెలుగుదాం!
ఏ ఊరి లో బ్రతికినా , ఏన్ని దేశాలు చుట్టినా చివరికి ఈ మట్టిలోనే కదా కలిసిపోవాలి.
I LOVE KOTHAPALLI - I LOVE INDIA
- డా. శింగనమల సుమన్
C/O సి. కొత్తపల్లి.
No comments:
Post a Comment