Tuesday, 1 November 2016

మాటమరుగు కళ్యాణ్ - స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు

మన ఊరు సి. కొత్తపల్లి కి చెందిన మాటమరుగు వెంకటసుబ్బయ్య గారి కుమారుడు "మాటమరుగు కళ్యాణ్" విదేశాలలో ఉద్యోగ రిత్యా దాదాపు రెండున్నర సంవత్సరాలు దుబాయ్ లో విధులు నిర్వర్తించి స్వదేశానికి తిరిగి వస్తున్నారు.

ఇటీవల సి.కొత్తపల్లి కింగ్స్ మీడియా పలుకరించగా, కళ్యాణ్ గారి స్వదేశీ ఆగమనము కి గల కారణం, "లక్షలు, కోట్ల" కంటే ఎక్కవైన తల్లీదండ్రుల మీద, భార్యా బిడ్డల మీద గల "ప్రేమే" కారణం అని చెప్పారు. ఇన్నాల్లూ, ఆర్ధిక స్ధిరత్వం కోసం అందరినీ వదిలి దాదాపు రెండున్నర సంవత్సరాలు దూరంగా ఉండి చాలా కోల్పోయాను, ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వదేశం వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ పిల్లల అల్లరి, వారి ఆలనా పాలనా చూస్తూ, తల్లీదండ్రుల యోగక్షేమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తానని చెప్పారు.

కొసమెరుపు ఏంటంటే కళ్యాణ్ గాఉ చెప్పిన ఒక మంచి మాట, ప్రతి ఒక్కరి నీ ఆలోచింపచేసి, ఆచరింపచేయునది, అది ఏంటంటే:

*ఒక బిడ్డ కి తండ్రి అయినప్పుడే - మన కన్న తండ్రి యొక్క ప్రేమ అర్ధమవుతుంది*

- మాటమరుగు కళ్యాణ్ చక్రవర్తి గారికి స్వదేశీ ఆగమన శుభాకాక్షలు.

Thursday, 27 October 2016

"అప్పయ్య" కుమారుడు అలియాస్ "పాలు" కు పాము కాటు.

మన ఊరి లో పసుపు పొలంలో పని కోసం వెల్లిన పాలు అన్న  పాము కాటుకు గురి అయ్యారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ హాని ఏమీ లేదని, త్వరలో కోలుకుటారని వైద్యులు చెప్పారు, ఇంకా అక్కడే ఉంది కొన్నిరోజులు చికిత్స తీసుకోవాలని ఆదేశించారు.

పాము కాటు వేసిన వెంటనే, ఆలస్యము చేయకుండా తగిన సమయంలో ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన కోర్లకుంట వెంకటేశ్ తదితరులను వైద్యులు అభినందించారు.

కోత్తపల్లి గ్రామ ప్రజలంతా పాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Monday, 24 October 2016

మన కొత్తపల్లి తో నా తీయటి జ్ఞాపకాలు

CLICK HERE

స్వాగతం - సుస్వాగతం

సి. కొత్తపల్లి గ్రామవాసులైన నా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ గ్రూపు నకు స్వాగతం సుస్వాగతం.

కొత్తపల్లి గ్రామానికి, మనకు గల అవినాభావ సంబంధం వెల కట్టలేనిది. కొత్తపల్లి లో పుట్టాం, పెరిగాం. పై చదువులకనో ఉద్యోగరిత్యా నో, బ్రతుకు తెరువు కోసమో, పెళ్ళి చేసుకోని అత్తగారిళ్ళలోనో ఎక్కడెక్కడో ఉంటున్నాం.

భగవంతుడు ఈ జన్మ లో ఇచ్చిన బంధాలను, స్నేహితులను, బంధుత్వాలను - ఇంకో జన్మలో కొనసాగిపడు - అసలు మళ్ళీ జన్మ అంటూ ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఈ జీవితం అశాశ్వితం - ఎప్పుడు ఎక్కడ గిట్టుతామో తెలియదు.

ఈ ఆధునిక యుగం లో బ్రతకాలి కాబట్టి ఉద్యోగం, పని, చదువు కై కొత్తపల్లిని విడిచి వుండక తప్పదు. కాబట్టి, ఈ జీవన్మరణ పోరాటంలో ఈ జన్మ కు ఆ భగవంతుడు ఇచ్చిన బంధాలను, స్నేహాన్ని, బంధుత్వాలనూ వదులుకోవాల్సిన పని లేదు,  ఈ సోషియల్ మీడియా ద్వారా కొనసాగించుకుందాం.

ఈ సోషియల్ మీడియా మనకు ఒక వరం లాంటిది.

ఒకప్పుడు బంధువులు అంటే ఏ పెళ్ళికో, చావు కార్యాలకో కలుసుకునే వారు, కానీ ఇప్పుడు అలాంటి పని లేదు సోషియల్ మీడియా ద్వారా ఎప్పటికప్పు ఒకరికొకరు తమ తమ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ, కష్ట, సుఖాలను పంచుకుటున్నారు.

"బ్రతకడం అంటే ఉద్యోగం, పని చేసుకోవమే కాదు - కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో ప్రేమానురాగాలు పంచుకోవడం".

నేను, నా కుటుంబం, నా కష్టం, నా సుఖం అనటం లో ఆనందం ఉండదు - నీ ప్రపంచం అంటే పక్క రాష్ట్రమో, పక్క దేశమో కాదు. నీ ఊరు, నీ కుటుంబం, నీ  బంధువులు, నీ స్నేహితులే నీ ప్రపంచం అని తెలుసుకో మిత్రమా !

ఈ గ్రూపు నందు ఎప్పటికప్పు మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తూనే, ఈ గ్రూపు నందు వున్న మన ఊరి వాళ్ళతో , మన బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటూ, మన ఐఖ్యత పది మందికి ఆదర్శం అయ్యేలా మెలుగుదాం!

ఏ ఊరి లో బ్రతికినా , ఏన్ని దేశాలు చుట్టినా చివరికి ఈ మట్టిలోనే కదా కలిసిపోవాలి.

I LOVE KOTHAPALLI - I LOVE INDIA

- డా. శింగనమల సుమన్
C/O సి. కొత్తపల్లి.

Sunday, 23 October 2016

Hello Kothapalli Kings

Welcome to the official site of kothapalli kings


PAGE WAS UNDER CONSTRUCTION